ప్రాణం తీసిన చదువు !
March 10, 2023
0
తెలంగాణలోని బాలానగర్ గ్రామానికి చెందిన నర్సింగరావుకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. నర్సింగరావు తన భార్యతో కలిసి ఈనెల 8న వికారాబాద్ జిల్లా కోటిపల్లిలో బంధువుల పెళ్లికి వెళ్లారు. గురువారం ఉదయం డిగ్రీ ద్వితీయ ఏడాది చదువుతున్న పెద్ద కూతురు వన్నెల పావని (19)కి ఫోన్ చేయగా కాలేజీకి వెళ్తున్నట్లు చెప్పింది. సాయంత్రం ఇంటికొచ్చిన భార్యభర్తలు ఎంతసేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా పావని చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. వెంటనే కిందికి దించి స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లిదండ్రులకు లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. 'మీరు నన్ను బాగా చూసుకున్నారు.. నేను ఏమీ చేయలేకపోతున్నాను.. వెళ్లిపోతున్నా.. సారీ మమ్మీ.. సారీ డాడీ.. అంటూ చివరి లేఖ రాసింది. తన కూతురు చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నానని బాధపడేదని, ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటుందన్న తండ్రి ఫిర్యాదు మేరకు సీఐ కె.భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Tags