తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబోరు గ్రామానికి చెందిన ముత్తయ్య, రామలక్ష్మి దంపతులకు కొడుకు సత్తిబాబు అదే గ్రామానికి చెందిన సునీత, స్వప్న కుమారి అనే ఇద్దరు యువతులను ప్రేమించాడు. వారితో ఏడాదిగా కాపురం కూడా చేస్తున్నాడు. సునీత, స్వప్నకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సంతానం కూడా ఉన్నారు. అయితే వీరి ఆచారం ప్రకారం పెళ్లికి ముందే కాపురం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారట !. ఇందులో భాగంగా సత్తిబాబు ఇద్దరు యువతులతో కాపురం చేసి వారినే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. పెళ్లి పత్రికలో చిరంజీవి సత్తిబాబు తో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి స్వప్న కుమారి, సునీత అని ఉంది. ఈ శుభలేఖ చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదేమిటని ముక్కున వేలేసుకుంటున్నారు.
వైరల్ అవుతున్న పెళ్లి పత్రిక !
March 08, 2023
0
Tags