జగనన్న విద్యాదీవెన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ వాయిదా వేసింది. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం గత నెల 28న విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దాన్ని ఈ నెల 7వ తేదీకి మార్చింది. తాజాగా దాన్ని మళ్లీ వాయిదా వేసినట్లు జిల్లాలకు సమాచారం పంపింది. తదుపరి తేదీని ప్రకటించలేదని జిల్లాల్లో అధికారులు చెబుతున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికిగాను 10.50 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి రూ.700 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల్ని విడుదల చేయాల్సి ఉంది.
జగనన్న విద్యాదీవెన మళ్లీ వాయిదా ?
March 07, 2023
0
Tags