బంగారం స్మగ్లింగ్‌ కేసులో ఎయిర్‌ ఇండియా సిబ్బంది అరెస్ట్‌

Telugu Lo Computer
0


బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ ఎయిర్‌ ఇండియా విమాన సిబ్బంది ఒకరు పట్టుబడ్డారు. 1487 గ్రాముల బంగారం తరలించేందుకు ప్రయత్నించిన షఫీని కస్టమస్స్‌ అధికారులు బుధవారం కొచ్చి ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేశారు. బహ్రెయిన్‌-కోజీకోడ్‌-కొచ్చి విమానంలో షఫీ బంగారం తీసుకొస్తున్నట్టు అధికారులకు సమాచారం అందడంతో అతడిని చెక్‌ చేశారు. బంగారం ఉన్న ప్లాస్టిక్‌ కవర్లను చేతికి చుట్టుకుని ఫుల్‌ స్లీవ్స్‌ కింద దాచిన బంగారం బయటపడింది. దీంతో షఫిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 6.8 కేజీల బంగారాన్ని అక్రమరవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు విమాన ప్రయాణికులను అరెస్టు చేశారు. సింగపూర్‌ నుంచి వచ్చిన ఆ ఇద్దరినీ చెన్నై ఎయిర్‌ పోర్టులో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.3.32 కోట్లని తెలిసింది. నిందితులు ఇద్దరు ఎయిర్‌ ఇండియాకు చెందిన రెండు వేర్వేరు విమానాల్లో వచ్చారని అధికారులు తెలిపారు. బంగారం అక్రమ రవాణాకు సంబంధించి తమకు అందిన సమాచారం అధారంగా వారిని అదుపులోకి తీసుకున్నట్టు చెన్నై కస్టమ్స్‌ అధికారులు ట్వీట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)