యువతి దారుణ హత్య !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర, శ్రీకాకుళంకు చెందిన దినకర్‌ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమను అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులు అంగీకరించలేదు. వేర్వేరు కులాలు కావడంతో తల్లిదండ్రులు వీరి పెళ్లిని వ్యతిరేకించారు. దీంతో ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకోలేనని దినకర్‌కు పవిత్ర చెప్పింది. రెండు నెలలుగా దినకర్‌ను ఆమె దూరం పెడుతూ వచ్చింది. పవిత్రకు ఇంట్లో మరొకరితో వివాహం కుదిర్చారు. ఇది తెలిసిన నిందితుడు దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై పవిత్రను నిలదీసేందుకు వెళ్లాడు. ఆమె ఆఫీస్‌ బయట వెయిట్ చేశాడు. ముందుగా ఇద్దరి మధ్య స్లోగా స్టార్ట్‌ అయిన వాగ్వాదం తర్వాత చినికిచినికి గాలి వానల పెద్దదైంది. తనను పెళ్లి చేసుకోవాలని దినకర్ ఆమెను పట్టుబట్టాడు. జరిగిందంతా తెలిసి కూడా ఎందుకిలా చేస్తున్నావ్‌ అంటూ ఆమె సమాధానం చెప్పింది. వెంటనే ఆగ్రహానికి గురైన దినకర్ తనతో తెచ్చుకున్న కత్తితో పవిత్రను సహోద్యోగులు చూస్తుండగానే పలుమార్లు విచక్షణారహితంగా పొడిచాడు. దాడిలో పవిత్ర మృతి చెందిన తర్వాత ఆమె మృతదేహం పక్కనే కూర్చున్నాడు దినకర్‌. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దివాకర్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన లీలాను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె ఒంటిపై 16 చోట్ల కత్తితో పొడిచిన గాయాలున్నట్లు తెలిపారు. జీవన్ భీమానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)