ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్‌లో ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ లీవ్ లెటర్ సంచలనంగా మారింది. నేరుగా ఎస్పీ దగ్గరకు వెళ్లి తన లీవ్ లెటర్ ను ఇచ్చాడు. అది చూసిన ఎస్పీ ముందు సీరియస్ అయినా, తరువాత తోటి పోలీసు బాధను అర్థం చేసుకున్నాడు. ఆ లెటర్ చూసి కాసేపు నవ్వుకున్నాడు. లెటర్ లో ఏముందంటే.. గత 22 ఏళ్లుగా హోలీకి పుట్టింటికి తీసుకెళ్లమని నా భర్య అడుగుతుంది.ఈసారి ఎలాగైనా తీసుకెళ్లాల్సిందేనని అలిగింది. అందుకు నాకు 10 రోజులు లీవ్ కావాలి సార్ ప్లీస్ అంటూ రాసుకొచ్చాడు. అదిచూసిన ఎస్పీ ముసి ముసి నవ్వులు నవ్వుతూ మన ఉద్యోగాలు ఎంట్రీ ఇచ్చినప్పుడే ప్రపంచమే మన కుటుంబం, ప్రజలే మన బంధువులుగా భావించాలి. భార్య కూడా మనల్ని అర్థం చేసుకోవాలి. సరే ఎవరికైనా ముందు కుటుంబమే ముఖ్యం నీకు పది రోజులు లీవ్ ఇవ్వలేను కానీ.. ఐదు రోజుల లీవ్ ఇస్తానంటూ ఎస్పీ చెప్పాడు. దీంతో ఇన్ స్పెక్టర్ ఆనందంతో థ్యాంక్యూ సార్ అంటూ ఇంటికి బయలు దేరాడు.
నా భార్య అలిగింది పది రోజులు లీవ్ కావాలి !
March 11, 2023
0
Tags