బెంగాల్‌లో 19మంది చిన్నారులు మృతి

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌ లో శ్వాస సంబంధిత సమస్యలతో చిన్నారుల మరణాల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల తరుణంలో సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని, ఫీవర్‌ క్లినిక్‌లు నిరంతరం పనిచేయాలని ఆరోగ్య శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. మరోవైపు, ఇదే అంశంపై సీఎం మమతా బెనర్జీ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌ మూలంగా ఇప్పటివరకు 19మంది చిన్నారులు మృతిచెందారని.. వీరిలో ఆరుగురు ఎడినో వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రజలు మళ్లీ మాస్కులు ధరించడం ప్రారంభించాలని దీదీ విజ్ఞప్తి చేశారు. మరోవైపు, గత రెండు నెలలుగా కోల్‌కతాలోని చిన్నారుల్లో దగ్గు, జలుబు, శ్వాసకోశ సంబంధిత కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్ల లోపు చిన్నారుల్లో అయితే తీవ్రమైన గురకతో ఇబ్బంది పడుతున్న కేసులూ నమోదయ్యాయి. వీరిలో కొందరినీ వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అందించాల్సి వచ్చినట్టు ఇటీవల అధికారులు తెలిపారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌ బారిన పడి ఇప్పటివరకు 19మంది చిన్నారులు మృతిచెందారు. ఇదిలా ఉం డగా.. జనవరి నెలలోని మూడు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 500 మంది అనుమానితుల నుంచి శాంపిల్స్‌ సేకరించి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలరా అండ్‌ ఎంటరిక్‌ డిసీజెస్‌కు పంపగా 33శాతం నమూనాల్లో అడినో వైరస్‌ను గుర్తించినట్టు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)