రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ అధికారిక గెజిట్ విడుదల

Telugu Lo Computer
0


100 రూపాయల నాణెంపై సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ ముద్రణపై కేంద్రం గెజిట్‌ను విడుదల చేసింది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్‌, 5 శాతం జింకుతో నాణెం తయారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఎన్టీఆర్‌ రూ.100 నాణెం మార్కెట్‌లోకి రాబోతోంది. లెజెండరీ సీనియర్ ఎన్టీఆర్ చిత్రపటంతో కొత్త రూ.100 నాణేన్ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మింట్ పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ సీనియర్ నందమూరి తారక రామారావు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన స్మారకార్థం ఎన్టీఆర్ నాణేనికి సంబంధించిన అధికారిక గెజిట్‌ను కేంద్రం ప్రభుత్వం విడుదల చేసింది. నాణెం 44 MM వ్యాసం కలిగి, 50శాతం వెండి, 40శాతం, రాగి, 5శాతం నికెల్, 5శాతం జింక్‌తో తయారు చేస్తారు. దీనిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 4160. ఈ నాణెంపై హిందీ, ఆంగ్ల భాషలలో  100 సంవత్సరాల వార్షికోత్సవం అని ముద్రించబడి ఉంటుంది. దానిపై 1923-2023 గుర్తు ఉంటుంది. ఈ నాణెం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజం గర్వించదగ్గ నిదర్శనంగా చెప్పబడుతోంది. ఈ నాణేన్ని త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టునున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)