ఢిల్లీ లోని మెహ్రూలీ ఆర్కియోలాజికల్ పార్క్ ప్రాంతంలో ఆక్రమణల నిరోధక డ్రైవ్‌ను శుక్రవారం మొదలెట్టారు. దాదాపు1200 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డిడిఎ) శనివారం తన ప్రకటనలో పేర్కొంది. స్థానిక నివాసితుల నుండి నిరసనలు, ఆప్, బిజెపి నినాదాల మధ్య, గట్టి పోలీసు భద్రత మధ్య డిడిఎ శుక్రవారం నుంచి ఈ ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. నిరసనకారులు 'డిడిఎ హాయ్ హాయ్. తానాషాహి నహీ చలేగి, నహీ చలేగి' అంటూ నినాదాలు చేశారు. ఈ కూల్చివేత డ్రైవ్‌ను అడ్డుకునేందుకు మహిళలు తీవ్ర ప్రయత్నం చేశారు. వారిపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. నిరసనకారులు డిడిఎ సిబ్బందిని, పోలీసులను అడ్డుకున్నారని తెలిపారు. 'కొంత మంది మహిళలు కారం పోలీసు సిబ్బంది మీద కారం చల్లారు. వారిలో కొందరిని నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది. వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం' అని కూడా ఆ అధికారి చెప్పారు. డిడిఎ ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను ఆదివారం కూడా కొనసాగించింది.
పోలీసులపై కారం చల్లిన మహిళలు !
February 12, 2023
0
Tags