ఆటోను ఢీకొన్న ట్రక్కు ఘటనలో ఏడుగురు విద్యార్థులు మృతి

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్‌ కంకేర్ జిల్లా కోరార్ గ్రామంలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థి, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటనపై సీఎం భూపేశ్ బఘేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)