విద్యార్థినిని ఐ లవ్ యూ అని చెప్పమన్నందుకు బర్తరఫ్ !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో క్లాస్ రూమ్‌లో విద్యార్థులందరి సమక్షంలో 8వ తరగతి విద్యార్థినిని ఐ లవ్ యూ చెప్పాలని కోరిన లెక్కల మాస్టారును విద్యా శాఖాధికారి (డిఇఓ) ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేశారు. ఇతర విద్యార్థుల సమక్షంలో మ్యాథ్స్ టీచర్ తనను ఐ లవ్ యూ అని చెప్పమన్నాడని కర్నావతి స్కూలులో ఆ 8వ తరగతి విద్యార్థిని ఒకరు తన తల్లిదండ్రులతో కలసి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిందని డిఇఓ బిఎస్ కైరా తెలిపారు. క్లాసులోని సిసిటివి ఫుటేజ్‌ను ఇద్దరు విద్యాశాఖ ఇన్‌స్పెక్టర్లు పరిశీలించారని, అయితే మాటలు స్పష్టంగా లేవని ఆయన చెప్పారు. అదీగాక ఆ విద్యార్థిని ఆరోపణలను ఇతర విద్యార్థులెవరూ ధ్రువీకరించడం లేదని ఆయన అన్నారు. అయితే ఆ విద్యార్థినిని, ఆమె తల్లిదండ్రులను సంతృప్లి పరచడానికి లెక్కల టీచర్ బాలముకుంద్‌ను ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేశామని డిఇఓ తెలిపారు. ఇదిలా ఉంటే..స్కూలు ట్రస్టీ అశోక్ భాంభర్ కథనం భిన్నంగా ఉంది. ఆ మ్యాథ్స్ టీచర్ విద్యార్థినితో ఐ లవ్ ఫార్ములా చెప్పమన్నాడు. ఆ అమ్మాయి ఫార్ములాను వివరించలేకపోయింది. మ్యాథ్స్ టీచర్ ఐ లవ్ యూ అని విద్యార్థినితో అనలేదని ఆయన చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)