అసోంలోని నాగావ్ పట్టణంలో ఆదివారం సాయంత్రం భూకంపం సంభవించింది. సాయంత్రం 4.18 గంటలకు, నాగావ్ పరిధిలోని పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. ఈ విషయాన్ని జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. అయితే, ఈ భూకంపం ప్రభావం ఏమేర ఉంది అనే విషయాలు ఏవీ వెల్లడించలేదు. ప్రజలపై, నివాసాలపై దీని ప్రభావం పెద్దగా లేనట్లు తెలుస్తోంది. నిపుణుల ప్రకారం.. 4.0 తీవ్రత అంటే ఇది చాలా చిన్న భూకంపమే. అయితే, టర్కీ, సిరియాల్లో నమోదైన భూకంప తీవ్రతకు దగ్గరగా ఉంది. అక్కడ 7.8 తీవ్రత నమోదైంది. టర్కీ, సిరియాల్లో భూకంప తీవ్రత చూసిన తర్వాత భూకంపం అంటేనే ప్రపంచం వణికిపోయే పరిస్థితి ఉంది.
అసోంలో భూకంపం
February 12, 2023
0
Tags