హాట్ కేకుల్లా అమ్ముడైన రెండో టెస్టు మ్యాచ్ టికెట్లు !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగే  రెండో టెస్టు మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైనాయి. 2017లో అరుణ్ జైట్లీ స్టేడియంలో చివరి టెస్టు మ్యాచ్ జరిగింది. రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని భారత జట్టు భావిస్తుండగా ఈ టెస్టులో ఎలాగైనా గెలుపొంది సిరీస్ సమం చేయాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది. దీంతో ఢిల్లీ టెస్టుపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ గ్రౌండ్ కెపాసిటీ దాదాపు 40 వేల మంది ప్రేక్షకులు ఉండగా, ఇందులో దాదాపు 24000 టిక్కెట్లు అభిమానులకు అందించారు. నిబంధనల ప్రకారం 8000 టిక్కెట్లను డిడిసిఎ అధికారులకు పంపిణీ చేయాల్సి ఉంది. కాగా, ఈనెల 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది, ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్న అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయని డిడిసిఎ జాయింట్ సెక్రటరీ రాజన్ మంచాంద ప్రకటించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)