తమిళనాడు కాంచీపురానికి చెందిన లక్ష్మీ నరసింహన్‌కు చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ సమీప తెయ్యూర్ గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. సోమవారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం రాత్రి కల్యాణ మండపంలో విందు ఏర్పాటు చేశారు. వధూవరుల కుటుంబీకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఆ సమయంలో వరుడు మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన వధువు అతనితో తనకు వివాహం వద్దంటూ వేదికపై నుంచి కిందకు దిగిపోయింది. విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు విందును మధ్యలోనే ఆపేశారు.
మొగుడు వద్దన్న వధువు !
February 15, 2023
0
Tags