కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్‌లో చేరారు. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె హాస్పిటల్‌కు వెళ్లిన సమయంలో వెంట ప్రియాంక వాద్రా కూడా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. రొటీన్ చెకప్ కోసం వచ్చారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో ఇబ్బందిపడుతూ మంగళవారం నుంచి అస్వస్థతలో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం యూపీలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'లో కొంతసేపు పాల్గొని మళ్లీ ఢిల్లీకి తిరిగి వచ్చారు.
గంగా రామ్ ఆసుపత్రిలో చేరిన సోనియా
January 04, 2023
0