మూడేళ్ల చిన్నారిని రైలు పట్టాలపైకి తోసేసిన మహిళ !

Telugu Lo Computer
0


అమెరికాలో ఒరెగాన్‌లో ర్వైలే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాంపై తన తల్లితో ఉన్న మూడేళ్ల చిన్నారిని గుర్తు తెలియని మహిళ రైలు పట్టాలపైకి తోసేసింది. ఈ మేరకు ముల్ట్‌నోమా కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయం తన వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. మూడేళ్ల బాలికను 32 ఏళ్ల బ్రియానా లేస్‌ వర్క్‌మెన్‌ అనే మహిళ తోసేసినట్లు పేర్కొంది. దీంతో బాలిక తలకు తీవ్ర గాయమై విలవిల్లాడిందని తెలిపారు. ఈ ఘటనతో అక్కడే ఫ్లాట్‌ ఫాంపై ఉన్న మిగత వ్యక్తులు వెంటనే స్పందించి సదరు చిన్నారిని రక్షించారు. ఆ చిన్నారి పోర్ట్‌ల్యాండ్‌లో నివసిస్తున్నట్లు పేర్కొంది. ఈ షాకింగ్‌ ఘటనతో సదరు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి దారుణాలకు ఎందుకు ఒడిగడుతుంటారో అర్థం కాదంటూ.. ప్రయాణికులలో ఒకరు ఆవేదనగా అన్నారు. ఈ మేరకు ఈ దారుణానికి పాల్పడిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే గాక బెయిల్‌ లేకుండా కస్టడీలోనే ఉంచనున్నట్లు అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)