కర్ణాటకలోని మండ్య జిల్లా మద్దూరు తాలూకా తొరెశెట్టిహళ్లికి చెందిన సుమిత్ర, జయమ్మలు స్నేహితులు. 2012 డిసెంబర్ 31న సుమిత్ర పక్క వీధిలో మంచినీటి కోసం వెళ్లిన సమయంలో బీరువాలోని రూ.1.16 లక్షల విలువైన 58 గ్రాముల నగలు, రూ.18 వేల నగదును జయమ్మ చోరీ చేసింది. సుమిత్ర ఇచ్చిన ఫిర్యాదుతో గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి జయమ్మను అరెస్ట్ చేశారు. నిందితురాలి నేరం రుజువు కావడంతో ఆరు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ మద్దూరు పట్టణం జేఎంఎఫ్ 1వ సివిల్ కోర్టు న్యాయమూర్తి వీ కోనప్ప తీర్పు వెలువరించారు.
స్నేహితురాలి ఇంట్లో చోరీ చేసిన మహిళలు ఆరేళ్లు జైలు శిక్ష
January 02, 2023
0
Tags