మాండోస్ తుఫాన్ బాధితులకు ఆర్ధిక సాయం విడుదల

Telugu Lo Computer
0


మాండోస్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఊరటనిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక సాయం విడుదల చేసింది. ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ఒక్క కుటుంబంలో గరిష్టంగా రూ.2000 అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ఆర్ధిక సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన తిరుపతి, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని బాధితులకు ఈ ఆర్ధిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాండోస్ తుఫాన్ కారణంగా తిరుపతి , నెల్లూరు , వైఎస్సార్, చిత్తూరు , అన్నమయ్య జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ కారణంగా వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. తడిసిన పంటను కొనుగోలు చేసి, తుఫాన్ బాధితులను ఆదుకోవాలని  టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాలకు దెబ్బతిన్న పంటను అంచనా వేసి రైతులను ఆర్ధికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య జిల్లాలో డ్యామ్ కొట్టుకుపోయి 64 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)