లేడీ డాక్టర్ ఆత్మహత్య ?

Telugu Lo Computer
0


కర్ణాటకలోని చిత్రదుర్గా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రూపా (50) సీనియర్ డాక్టర్ గా పని చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ రూపా డాక్టర్ కేజీ. రవిని వివాహం చేసుకున్నారు.  డాక్టర్ రూపా చాలా సంవత్సరాల నుంచి చిత్రదుర్గా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నారు. డాక్టర్ రూపా భర్త డాక్టర్ రవి చిత్రదుర్గాలో గిరికాంత ఆర్థో కేర్ సెంటర్ అనే ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నాడు.  ఇంట్లోని బాత్ రూమ్ లో డాక్టర్ రూపా రక్తపుమడుగులో పడి ఉండటాన్ని గుర్తించిన పని మనిషి వెంటనే రవికి సమాచారం ఇచ్చింది. వెంటనే రూపాను చిత్రదుర్గాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే డాక్టర్ రూపా చనిపోయారని వైద్యులు నిర్దారించారు. పోస్టుమార్టం నివేదికలో రూపా రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని వెలుగు చూసింది. రూపా ఇంటిలో డెత్ నోట్ దొరికిందని పోలీసులు తెలిపారు. రూపా డెత్ నోట్ లోని వివరాలు ఇప్పుడే బయటకు చెప్పలేమని చిత్రదుర్గా జిల్లా ఎస్పీ కే. పరుశురామ్ అన్నారు. ఇటీవల మేము 25 ఎకరాల్లో దానిమ్మ తోట పెట్టారని, పంట నాశనం కావడంతో సుమారు రూ. 1 కోటి వరకు నష్టం వచ్చిందని డాక్టర్ రవి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇటీవల తాము ఓ ప్రైవేట్ హోటల్ కొనుగోలు చేశామని, అందులోనా నష్టం వచ్చిందని. కొంతకాలంగా ఇదే విషయంలో చర్చ జరిగిందని డాక్టర్ రవి సమాచారం ఇచ్చారని పోలీసులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)