రివాబా డేజా ఘన విజయం

Telugu Lo Computer
0


గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్‌ జామ్‌నగర్‌ నుంచి పోటీ చేసిన క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఘన విజయం సాధించారు. బీజేపీ టికెట్ పై పోటీ చేసిన రివాబా సమీప అభ్యర్థిపై 61,065 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా రివాబా జడేజా మీడియాతో మాట్లాడుతూ తనకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన బీజేపీతో పాటు తన కోసం ప్రచారంలో పనిచేసిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తన విజయం మాత్రమే కాదు, ప్రజలందరి విజయం అంటూ రివాబా సంతోషం వ్యక్తం చేశారు. నార్త్‌ జామ్‌నగర్‌ నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లలో ఆమెకు 55% పైగా ఓట్లు వచ్చాయి. ఆమె తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అహిర్ కరాషన్‌భాయ్ పర్బత్‌భాయ్ కర్మూర్ (23.37%), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు చెందిన బిపేంద్రసిఘ్ చతుర్‌సిన్హ్ జడేజా (15.49%) ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)