బ్లాక్‌స్టోన్‌ చేతికి కేర్ హాస్పిటల్ ?

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ కేంద్రంగా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తున్న కేర్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం చేతులు మారనుంది.  ఈ కార్పొరేట్‌ వైద్య సేవల సంస్థలో మెజార్టీ వాటాను టీపీజీ కేపిటల్‌ అనే ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ నుంచి కొనుగోలు చేయడానికి అమెరికా సంస్థ బ్లాక్‌స్టోన్‌ సిద్ధమవుతున్నట్లు మార్కెట్‌ వర్గాల్లో ప్రచారం అవుతోంది. అగ్రశ్రేణి ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడుల సంస్థల్లో బ్లాక్‌స్టోన్‌ ఒకటి. దీంతో పాటు సింగపూర్‌కు చెందిన తమసేక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సైతం కేర్‌ హాస్పిటల్స్‌పై ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. కొనుగోలు కోసం ఎంతో కాలంగా సాగుతున్న సంప్రదింపులు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. అయితే ఇతర సంస్థలు పోటీ నుంచి తప్పుకున్నందున, టీపీజీ కేపిటల్‌ నుంచి కేర్‌ హాస్పిటల్స్‌లో మెజార్టీ వాటాను బ్లాక్‌స్టోన్‌ సొంతం చేసుకునే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ లావాదేవీ విలువ రూ.8,000 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఇది పూర్తయితే మనదేశంలో వైద్య సేవల రంగంలో చోటు చేసుకున్న అతిపెద్ద లావాదేవీల్లో ఒకటిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. కేర్‌ హాస్పిటల్స్‌లో వాటా విక్రయించేందుకు కొంతకాలంగా టీపీజీ కేపిటల్‌ ప్రయత్నిస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్ల ద్వారా, ఆసక్తి గల ఇన్వెస్టర్లతో మాట్లాడుతోంది. ఎట్టకేలకు ఈ వ్యవహారం పూర్తికానున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)