భారత్ నాలో భాగమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సరే ఆ వారసత్వాన్ని తన వెంట తీసుకెళ్తానన్నారు. 2022 ఏడాదికి గానూ సుందర్ పిచాయ్ కి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు శాన్ ఫ్రాన్సిస్కో లో సుందర్ పిచాయ్‌కి అందజేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఆయన ఈ అవార్డు తీసుకున్నారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడారు. అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ గౌరవం కల్పించిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
భారత్ నాలో భాగం : సుందర్ పిచాయ్
December 03, 2022
0