గుజరాత్ లోని సూరత్‌కు చెందిన విపుల్ పటేల్ అనే రైతు తన కుమార్తె వివాహాన్ని వినూత్నంగా, పర్యావరణహితంగా జరిపించి శెభాష్ అనిపించుకున్నారు. కుమార్తె రిద్ధి పెళ్లిని అందరిలాగే ఘనంగా చేయాలనుకున్నాడు. పెళ్లి ద్వారా ప్రజలకు ఓ సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఈ క్రమంలో బంధువులకు తులసి విత్తనాలతో కూడిన వివాహ ఆహ్వాన పత్రికలను అందించాడు. ఆ విత్తనాలను మట్టిలో నాటి పెంచాల్సిందిగా వారిని కోరాడు. పెళ్లి సమయంలో వధూవరూలను ఎడ్ల బండిలోనే మండపానికి తీసుకువచ్చాడు. కన్యాదానం చేసేటప్పుడు కూతురికి ఒక గిర్ జాతి ఆవును కానుకగా ఇచ్చాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులతోనే వంటకాలు తయారు చేయించి విందును ఏర్పాటు చేశాడు. తినే కంచాలు, నీళ్ల గ్లాసులు సహా ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. వివాహానికి హాజరైన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ఆయన ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు.
కుమార్తె వివాహాన్ని వినూత్నంగా చేసిన రైతు !
December 12, 2022
0
Tags