తెలంగాణ పిసిసి కమిటీ ప్రకటన

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్‌గా 40 మంది కార్యనిర్వాహక కమిటీని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, అజహరుద్దీన్, మహేశ్ గౌడ్‌లను వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా ప్రకటించింది. మాణికం ఠాగూర్ చైర్మన్‌గా 18 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించింది. ఈ కమిటీలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి. హనుమంత రావు, శ్రీధర్ బాబు, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర్ రాజనర్సింహ, రేణుకా చౌదరి, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, బలరామ్ నాయక్, జానా రెడ్డి, వంశీచంద్ రెడ్డి, టి. జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ సభ్యులుగా ఉన్నారు. 24 మంది కొత్త ఉపాధ్యక్షులు, 59 మంది ప్రధాన కార్యదర్శులను, 26 జిల్లాలకు కొత్త డిసిసి అధ్యక్షులను కూడా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. కొత్త కమిటీలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేరు లేకపోవడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)