వర్ధంతి వేడుకలో పది వాహనాలు దగ్ధం !

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్‌లోని సోంక్యారీ పోలీస్‌ పోస్ట్‌ ఏరియాలోని ఘఘ్రా గ్రామంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తండ్రి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఆర్కెస్ట్రా కార్యక్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకునే లోపు మంటలు వేగంగా వ్యాపించి, పార్కింగ్‌లో ఉన్న బైక్‌లకు మంటలు అంటుకున్నాయి. దీంతో దాదాపు పది వాహనాలకు పైగా కాలి బూడిదయ్యాయి. ప్రాణనష్టం జరుకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి మాత్రం కారణాలు తెలియరాలేదు. జాష్పూర్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినయ్‌ భగవత్‌ తండ్రి దేవ్‌రామ్‌ భగవత్‌ వర్ధంతి సందర్భంగా ఆర్కెస్ట్రా కార్యక్రమాని నిర్వహించారు. కార్యక్రమానికి చూసేందుకు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)