రెండో టెస్టులో టీమిండియా విజయం

Telugu Lo Computer
0


ఢాకా వేదికగా బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్య ఛేదనలో 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను శ్రేయస్‌ అయ్యర్‌ (29), రవిచంద్రన్‌ అశ్విన్‌ (42) ఆదుకున్నారు. ఎనిమిదో వికెట్‌కు 71 పరుగులు జోడించి భారతజట్టును విజయతీరాలకు చేర్చారు. కాగా ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో క్వీన్‌ స్వీప్‌ చేసింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కేఎల్‌ రాహుల్‌, గిల్‌, పుజారా, కోహ్లీ, రిషభ్‌ పంత్, అక్షర్‌ పటేల్‌, ఉనాద్కత్‌.. ఇలా వచ్చిన వారు వచ్చినట్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ చేరుకున్నారు. దీంతో బంగ్లా చేతిలో మరో భంగపాటు తప్పదని చాలామంది భావించారు. అయితే శ్రేయస్‌ అయ్యర్, అశ్విన్‌లు నిలకడగా ఆడారు. క్రీజులో నిలదొక్కుకుని నిదానంగా ఆడుతూ టీమిండియా స్కోరుబోర్డును ముందుకు కదిలించారు. శ్రేయస్‌ సంయమనంతో ఆడగా, అశ్విన్‌ మాత్రం వీలైనప్పుడల్లా బౌండరీలతో చెలరేగాడు. వీరిద్దరూ అభేద్యమైన 8 వికెట్‌కు 71 పరుగులు జోడించి జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించారు. వీరిద్దరి మధ్య 71 పరుగుల అజేయ భాగస్వామ్యం ఉంది. అశ్విన్ 42, అయ్యర్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)