అత్యాచారం చేసి చంపేసిన బాబాయ్‌ !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి కేశవ నాయక్ తండాకు చెందిన హనుమంతు నాయక్‌, భార్య ఇద్దరు పిల్లలతో ఇటీవల హైదరాబాద్‌లో శుభకార్యానికి వెళ్లారు. దీంతో పదవ తరగతి చదువుతున్న తన చిన్న కుమార్తె మాత్రమే ఇంట్లో ఉంది. ఇది గమనించిన కొందరు యువకులు అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఆ బాలికను బలాత్కారం చేసి, హతమార్చినట్లు సమాచారం. మృతి చెందిన విద్యార్థినికి సమీప బంధువైన శీను నాయక్‌ (వరుసకు బాబాయ్)తో తోపాటు చిన్న రేవల్లికి చెందిన శివ మరికొందరు యువకులే మృతికి కారకులుగా భావిస్తున్నారు. ఘటనపై ఆగ్రహించిన విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రులు వారి ఇళ్లపై దాడికి దిగారు. మరోవైపు శివ టీవీ రిపేర్ షాప్‌లో ఉన్న సామాగ్రిని బయటకు తెచ్చి అతని కారుతోపాటు వాటిని తగలబెట్టారు. దీంతో ఇటు తిరుమలగిరి అటు చిన్న రేవల్లి గ్రామాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)