ఉద్యోగులు చెల్లించిన ఎన్‌పిఎస్ (జాతీయ పెన్షన్ వ్యవస్థ) కార్పస్ ఫండ్ మొత్తాన్ని తమకు తిరిగి ఇచ్చేయాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రం, రాష్ట్రాల వారీగా చందాదారులు, వారి కంట్రిబ్యూషన్ల మొత్తాలు, ఎన్‌పిఎస్ కింద పోగైన ఆస్తుల (అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్-ఎయుఎం) వివరాలను వెల్లడించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన డేటా ప్రకారం, 20లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఎన్‌పిఎస్ చందాదారులు వున్నారు. 50లక్షలకు పైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి తమ వాటాలను చెల్లించారు. ఎన్‌పిఎస్ (కేంద్ర ప్రభుత్వం) కింద పోగైన మొత్తం ఆస్తులు రూ.2 లక్షల కోట్లకు పైనే వుండగా, రాష్ట్ర ఉద్యోగుల మొత్తం వాటా ఈ ఏడాది అక్టోబరు 31నాటికి రూ.3.5లక్షల కోట్లకు పైమాటే. రాజ్యసభలో ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిస్తూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్ ఈ వివరాలను వెల్లడించారు.
ఎన్‌పిఎస్ కార్పస్ ఫండ్ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయండి !
December 16, 2022
0
Tags