ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి

Telugu Lo Computer
0


అస్సాం రాష్ట్రం గోల్‌పరా ప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అడవిలో నుంచి వచ్చిన గజరాజుల గంపు రహదారిపై వెళ్తున్న ప్రయాణికులపైకి దూసుకొచ్చి దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గోల్‌పరా ప్రాంతంలో గురువారం అటవీ ప్రాంతంలోని రహదారిపైకి వచ్చిన ఓ ఏనుగుల గుంపు రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలైనట్లు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ద్రుబదత్త తెలిపారు. ఏనుగుల దాడిలో రెండు వాహనాలు సైతం పూర్తిగా ధ్వంసమైనట్లు ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)