కర్ణాటకలో మా సత్తా చాటుతాం !

Telugu Lo Computer
0


కర్ణాటకలో 2023లో జరగను న్న శాసనసభ ఎన్నికల్లో కనీసం 60 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్ణయించుకుంది. ఆప్‌ కర్ణాటక శాఖ ఉపాధ్యక్షుడు, మాజీ డీజీపీ భాస్కర్‌రావు బెంగళూరు లో మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల తర్వాత గుజరాత్‌ ఎన్నికల్లోనూ ఖాతా తెరిచామని 15 సంవత్సరాల పాటు బీజేపీ ఆధీనంలో ఉన్న ఢిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సత్తా చాటామని చెప్పారు. గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం వెనుక ఆప్‌ ఉందంటూ వస్తున్న ప్రచారం సరికాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చునని తెలిపారు. గుజరాత్‌లో ప్రజల విశ్వాసాన్నిచూరగొనలేకపోయామని, ప్రధానితో సహా కేంద్ర మంత్రులంతా గుజరాత్‌ ఎన్నికల సమయంలో తిష్టవేశారంటే ఆప్‌ ప్రభావానికి ఎంతగా భయపడ్డారో తెలుస్తోందన్నారు. గుజరాత్‌లో రానున్న రోజుల్లో బీజేపీకి బలమైన ప్రత్నామ్నాయంగా ఆప్‌ సిద్ధమవుతుందన్నారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారానికి స్వయంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ రానున్నారని ఆయన వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)