ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక పొలంలో తల లేకుండా ఉన్న మూడేళ్ల చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు పొరుగింటి వ్యక్తే నరబలిలో భాగంగా ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు 16 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడు విచారణలో బాలుడిని చెరుకుతోటలో వదిలేసినట్లు చెప్పడంతో పోలీసుల బృందం మీరట్‌లోని ఇంచోలిలోని నాంగ్లీ-ఇసా గ్రామానికి చేరుకుంది. అక్కడ సమీపంలోనే ఆ బాధిత చిన్నారి తలను కనుగొన్నారు. ఆ చిన్నారి వస్తువులు, బట్టలు ఆధారంగా నవంబర్ 30న తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో తప్పిపోయిన చిన్నారిగా పోలీసులు గుర్తించారు. చిన్నారి దారుణ హత్య గురించి తెలుసుకుని...కుటుంబ సభ్యులు, స్థానికులు నిరసనలు చేపట్టారు. అయితే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కూడా రాళ్లు రువ్వినట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తలలేని చిన్నారి మృతదేహం లభ్యం !
December 07, 2022
0
Tags