రాత్రి పార్టీలో డ్యాన్స్‌కి రూ.5 వేల నుంచి రూ.25 వేలు వసూలు !

Telugu Lo Computer
0


'జంటగా వస్తేనే న్యూ ఇయర్‌ పార్టీ'లోకి అనుమతి' అంటూ నిబంధన విధించిన కొన్ని స్టార్‌ హోటళ్లు, క్లబ్బులు జోడీ కోసం ప్రత్యేక యాప్‌లు సైతం పుట్టుకొచ్చాయి. ఒక్క రాత్రి పార్టీలో డ్యాన్స్‌ చేసేందుకు యువతికి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు ధర నిర్ణయించాయి. మరికొన్ని హోటళ్లకు చెందిన యాప్‌లు రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకూ వసూలు చేసినట్లు సమాచారం. అయితే పార్టీ కాగానే సంబంధిత యువతిని భద్రంగా ఇంటికి చేర్చాలన్న నిబంధన పెట్టాయి. దీంతో ఖరీదైన యువకులు తమకు నచ్చిన జోడీ కోసం డబ్బు నీళ్లలా ఖర్చు చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా శనివారం రాత్రి నుంచి మద్యం ఏరులై పారింది. తమిళనాడు ప్రభుత్వం సైతం సంవత్సరాది నాడు రూ.400 కోట్ల మేర మద్యం విక్రయించాలనే టార్గెట్‌ ఇవ్వడంతో అధికారులు మద్యాన్ని బార్లు, హోటళ్ల వద్ద కావాల్సిన మేర అందుబాటులో వుంచారు. పోలీసులు ఎన్ని నిబంధనలు విధించినా నగరంలోని పలు హోటళ్లలో వేకువజాము వరకు పార్టీలు సాగగా, మందుకు కొదవే లేకుండాపోయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)