తండ్రిని చంపి 32 ముక్కలు చేసి బావిలో పడేసిన తనయుడు !

Telugu Lo Computer
0


కర్ణాటక బాగల్‌కోట్‌లో విఠల్ కులాలి అనే యువకుడు తండ్రిని దారుణంగా హత్య చేసి, శవాన్ని 32 ముక్కలు చేసి, వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో పడేశాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు, పరశురామ్ తాగుబోతు. రోజు ఫుల్లుగా తాగి  కుమారుడ్ని తిట్టేవాడు. ఇతని బాధ భరించలేక భార్య, పెద్ద కుమారుడు వేరే ఇంట్లో నివసిస్తున్నారు. చిన్నకుమారుడు విఠల్  తండ్రితో పాటు ఉంటున్నాడు. పరశురామ్ రోజు తాగొచ్చి విఠల్‌ను దుర్భాషలాడేవాడు. తండ్రి తిట్లను భరించలేకపోయిన విఠల్ ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో పరశురామ్ చనిపోయాడు. అనంతరం శవాన్ని 32 ముక్కలు చేశాడు. శరీర భాగాలను తీసుకెళ్లి మంతూర్ బైపాస్ వద్ద తమ వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో పడేశాడు. విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగి విఠల్ ను అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బోరుబావి నుంచి పరశురామ్ శరీర భాగాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రొక్లేన్లతో తీశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)