వచ్చే నెల నుంచి పెన్షన్ మొత్తాన్ని పెంపుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం జనవరి 1 నుంచి పెరిగిన మొత్తంతో కలిపి పెన్షనర్లకు రూ. 2,750 అందనుంది. ఈ నిర్ణయంతో దాదాపు 62.31 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. కాగా, సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ మీటింగ్‌లో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ట్యాబ్‌లు స్వయంగా మంత్రులే ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అలాగే, వైఎస్‌ఆర్ పెన్షన్ పెంపు, ఆసరా కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనాలని స్పష్టం చేశారు. గడప గడప కార్యక్రమానికి ప్రాధాన్యమివ్వాలని, జిల్లా అధ్యక్షులతో కలిసి సమస్యలు పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. అలాగే, అవినీతికి దూరంగా ఉండాలని మంత్రులకు సూచించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను బలంగా చెప్పుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను కోరారు. ప్రజలకు ఎంత చేస్తున్నా, చెప్పుకోవడంలో వెనుకబడిపోతున్నామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
జనవరి 1 నుంచి పెరగనున్న పెన్షన్లు !
December 13, 2022
0
Tags