హేమంత్‌ సోరెన్‌కు ఈడీ నోటీసులు

Telugu Lo Computer
0


అక్రమ మైనింగ్‌ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ను రాంచీలోని కార్యాలయం ముందు నవంబర్‌ 3న  విచారణకు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో మరో ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి పంకజ్‌పై మార్చిలో మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేశారు. అనంతరం గత జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. పంకజ్ మిశ్రా, అతని వ్యాపార భాగస్వాములకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.42 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)