ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో ఓ యువతిని దారుణంగా హత్య చేసి, శవాన్నికారు డిక్కీలో కుక్కి నాలుగు రోజులపాటు అలాగే ఉంచాడు. ఆదివారం కారులో నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనకు కారణమైన వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. మృతురాలితోపాటు ఆ వ్యక్తి బిలాస్ పూర్ లోని తిక్రపరా ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్నారు. వీరు స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడి పెటినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా నష్టాలు రావడతో ఇద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవలు జరిగాయి. డబ్బుల కోసం యువతి ఒత్తిడి తెస్తోందని, పట్టణంలోని దయాల్ బంద్ ప్రాంతంలో గొంతకోసి హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు. అనంతరం శవాన్ని కారులోనే ఉంచి కస్తూర్భా నగర్ లోని తన ఇంటికి తీసుకువచ్చాడు. నాలుగు రోజుల తర్వాత కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కారు లోనుంచి శవాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపలోకి తీసుకున్నారు. అయితే ఇతర కోణాల్లో నుంచి కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
యువతి దారుణ హత్య !
November 21, 2022
0
Tags