విజయవాడ-కడప-బెంగళూరు హైవే !

Telugu Lo Computer
0


విజయవాడ-కడప-బెంగళూరు మధ్య అత్యాధునిక సదుపాయాలతో గ్రీన్ ఫీల్డ్ కంట్రోల్డ్ యాక్సెస్ కారిడార్ ను నిర్మించబోతున్నట్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇది కర్నాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రధాన నగరాల్ని అనుసంధానం చేస్తుందని గడ్కరీ వెల్లడించారు. అమరావతి రాజధానిలో భాగంగా ఉన్న విజయవాడతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న కడప నగరాన్ని ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కలపబోతోంది. అలాగే ఏపీ-కర్నాటక సరిహద్దుల్లోని బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి 44లో అనంతపురం జిల్లా కొండికొండ దగ్గర మొదలయ్యే ఈ జాతీయ రహదారి ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలోని చెన్నె-కోల్ కతా జాతీయ రహదారి 16కు ఇది కలుస్తుంది. విజయవాడ-కడప-బెంగళూరు మధ్య అభివృద్ధి చేసే గ్రీన్ ఫీల్డ్ కంట్రోల్డ్ యాక్సెస్ కారిడార్ ను రూ.13600 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు గడ్కరీ ట్వీట్ లో తెలిపారు. దీని వల్ల విజయవాడ-బెంగళూరు మధ్య 75 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు 5 గంటల ప్రయాణ సమయం కూడా తగ్గబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత, ప్రతిపాదిత ఆర్ధిక, పారిశ్రామిక నోడ్ లు అయిన గుంటూరు, కడప, కొప్పర్తిలను అనుసంధానం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. 2025-26 కల్లా ఇది పూర్తవుతుందని గడ్కరీ వెల్లడించారు.

The project for 342 km long Bangalore-Kadapa-Vijayawada Greenfield Access Controlled Corridor is being developed at a total capital cost of Rs. 13,600 Cr. #PragatiKaHighway #GatiShakti

Post a Comment

0Comments

Post a Comment (0)