హైదరాబాద్ లోని మల్కాజ్గిరి సీసీఎస్ ఎస్ఐగా పని చేస్తున్న ధరావత్ విజయ్పై నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రేప్ కేసు నమోదైంది. తనతో కొంతకాలం సహజీవనం చేశాడని యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఓ యువతి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇంతకు ముందే పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి తనతో సహ జీవనం చేశాడని ఆమె తెలిపింది. కొంతకాలం తామిద్దరం హైదరాబాద్‌లో కలిసే ఉన్నామని బాధితురాలు తెలిపింది. ఇప్పుడు తనను వేరే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదులో సదరు యువతి పేర్కొంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్సై విజయ్‌పై కేసు నమోదు చేశారు. యువతి ఫిర్యాదుతో ఎస్ఐ విజయ్‌ను రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు. కేసుపై పూర్తి విచారణ జరపాలని ఆదేశించారు. గతంలో వనస్ధలిపురం పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో కూడా విజయ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు.
మల్కాజిగిరి సీసీఎస్ ఎస్సై సస్పెండ్
July 10, 2022
0
Tags