కర్ణాటక చెందిన రమేష్ అనే 30 సంవత్సరాల యువకుడు తన భార్యతో కలిసి వికారాబాద్ పట్టణంలో వాచ్‌మెన్‌గా పని చేసేవారు. ఇద్దరికి ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం అయింది. ముగ్గురు పిల్లలలో కలిసి కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో నివాసముంటున్నారు. ఆ సమయంలో వికారాబాద్ టౌన్‌కి చెందిన దస్తప్పాతో రమేష్ భార్య వెన్నెల వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలోనే భర్త ఆమెతో గొడవపడేవాడు. అయినప్పటికి భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తన కుటుంబాన్ని కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణానికి మార్చాడు. ఎల్లారెడ్డి పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న భవనములో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. తన భార్య వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుందనే కారణంతోనే రమేష్ ఫ్యామిలీని వికారాబాద్ నుంచి ఎల్లారెడ్డికి మార్చినప్పటికి ఆమెలో మార్పు రాలేదు. ఎల్లారెడ్డికి చేరుకున్నప్పటికి ప్రియుడు దస్తప్పను ఇంటికి పిలిపించుకొని పలుమార్లు శరీరక సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయం భర్త రమేష్‌కు తెలియడంతో మరోసారి భార్యను హెచ్చరించాడు.ప్రియుడితో తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని..అతడ్ని చంపేస్తే తాను ప్రియుడితో సుఖంగా ఉండవచ్చనే ఆలోచన చేసింది రమేష్ భార్య. ప్రియుడు దస్తప్పతో కలిసి భర్తను చంపడానికి వేసిన పథకం వేసిన వెన్నెల గత నెల 30వ తేదిన రమేష్‌ను హత్య చేసి అతను వాచ్‌మెన్‌గా పని చేస్తున్న నిర్మాణ భవనంలోనే పాతిపెట్టారు. భర్తను హతమార్చిన తర్వాత వెన్నెల కర్నాటకలోని స్వగ్రామానికి వెళ్లింది. అక్కడ బంధువులు, కుటుంబ సభ్యులు భర్త రమేష్ ఏమయ్యాడని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన రమేష్ కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేష్ కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదుతో ఎల్లారెడ్డి సీఐ, ఎస్‌ఐ మృతుడు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న భవనం దగ్గరకు వెళ్లి గోడ కింద తవ్వి చూడటంతో రమేష్ శవం బయటపడింది. రమేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించిన పోలీసులు కేసు విచారణలో భాగంగా పోలీసులు మృతుని భార్య వెన్నెల మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. అందులో ప్రియుడు దస్తప్పతో ఎక్కువ సార్లు ఫోన్‌కాల్స్ చేసి మాట్లాడినట్లుగా గుర్తించారు. ఈకేసులో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆమె తన ప్రియుడి తో కలిసి రమేష్‌ను హత్య చేసినట్టు తెలిపింది. తన సుఖం కోసం క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కట్టుకున్న భర్తను, సొంత పిల్లలకు దూరమై కటకాటాల పాలైంది తల్లి తీచేసిన తప్పుకు పిల్లలు అనాధలయ్యారు.
ప్రియుడే మోజులోపడి మొగుడుని చంపింది !
July 09, 2022
0
Tags