ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా మహమ్మారి బారినపడ్డారు.. గుంటూరు జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు తాజాగా నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలగా, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి కూడా కోవిడ్‌ సోకింది.. ప్రస్తుతం ఈ ఇద్దరు హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.  ఈ మధ్య తమను కలిసినవారంతా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని.. కరోనా మహమ్మారి బారినపడకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)