అసోంలోని నాగోన్ జిల్లాలో మహిళను హత్య చేశాడన్న కారణంతో గ్రామస్తులు ఒక వ్యక్తిని సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఇటీవల జరిగింది. గిరిజన ప్రాంతమైన ఇక్కడ కార్బి తెగ వారు ఎక్కువగా ఉంటారు. ఇటీవల రాంజీ బర్దోలోయ్ అనే వ్యక్తి, కొత్తగా పెళ్లైన ఒక మహిళను మరో నలుగురితో కలిసి హత్య చేశాడు. హత్య జరిగిన తర్వాత ఒక వృద్ధ మహిళ తామే ఈ హత్య చేసినట్లుగా చెప్పుకొంది. దీనిపై గ్రామంలో ప్రచారం జరడగడంతో అందరూ కలిసి పంచాయితీ నిర్వహించి, ఈ హత్యపై ఆమెను ప్రశ్నించారు. ఐదుగురు కలిసి మహిళను హత్య చేసినట్లు ఆమె తెలిపింది. దీంతో నిందితులను గ్రామస్తులు పట్టుకొచ్చారు. అందులో ప్రధాన నిందితుడైన రాంజీని ప్రశ్నించారు. అతడు మహిళను హత్య చేసినట్లుగా అంగీకరించారు. వెంటనే కోపం తెచ్చుకున్న స్థానికులు అతడిపై తీవ్రంగా దాడి చేశారు. కొందరు అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో అతడి శరీరం 90 శాతం కాలిపోయి మరణించాడు. వెంటనే అతడిని దగ్గర్లోనే పాతిపెట్టారు. ఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం అందింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు బాధ్యులైన కొందరు నిందితులను అరెస్టు చేశారు.
మహిళ హత్య చేసిన నిందితుడిని కాల్చి చంపిన గ్రామస్తులు
July 10, 2022
0
Tags