దేశంలో 18,840 కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,840 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 43 మరణాలు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం 1,25,028 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 4.14 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 4,36,04,394 కేసులు నమోదు కాగా వారిలో 5,25,386 మరణించారు. దేశంలో కరోన రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 16,104 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,29,53,980కిచేరిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో వైపు దేశంలో గడిచిన 540 రోజులుగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు198,65,36,288 కోట్ల డోసుల టీకాలు వేశారు. నిన్న ఒక్కరోజే 12,26,795 డోసుల టీకాలు వేశారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)