రాజస్థాన్ అజ్మీర్‌లో ఇద్దరు ధనికులైన మహిళలకు ఓ ఆస్తి విషయంలో గొడవైంది. అది కాస్త తీవ్ర రూపం దాల్చింది. అంతే వారిద్దరు కొట్టుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటూ పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలో పడిపోయారు. అయినా సరే వాళ్లు మాత్రం కొట్టుకోవడం ఆపట్లేదు. చుట్టుపక్కల ఉన్నవారు ముందు బయటకి రండి, ఆ తర్వాత కొట్టుకుందురు అని చెప్తున్నా వాళ్లు వినడం లేదు. ఇంతలో మరో ఇద్దరు మహిళలు ఆ కాలువలోకి దూకి అప్పటికే కొట్టుకుంటున్న మహిళలతో పాటు గొడవలో పాలుపంచుకున్నారు. ఈ విషయం గురించి సమాచారం అందడంతో స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వారిద్దరికీ సర్ది చెప్పారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది.
డ్రైనేజీలో పడ్డా కొట్టుకోవడం ఆపలేదు... !
June 19, 2022
0
Tags