తండ్రీకొడుకుల అరుదైన సెల్ఫీ !

Telugu Lo Computer
0


సురేష్‌ కుమార్‌ అనే వ్యక్తి ట్వీటర్‌లో షేర్‌ చేసిన ఈ చిత్రంలో ఉన్న తండ్రి రైల్వేలో గార్డుగా పనిచేస్తుండగా, కుమారుడు అదే రైల్వే శాఖలో ట్రావెల్‌ టికెట్‌ ఎగ్జామినర్‌గా ఉద్యోగం సాధించాడు. తండ్రీకొడుకులు డ్యూటీలో ఉన్న సమయంలో ఒక రోజు అకస్మాత్తుగా ఎదురెదురు రైళ్లలో తారసపడ్డారు. ఆ క్షణంలో తీసుకున్న సెల్ఫీ ఫొటోనే ఇది. ఇందులో తండ్రీకొడుకులు ఇద్దరు కూడా తమ యూనిఫామ్‌ ధరించి ఉన్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగవైరల్‌ అవుతోంది. ఈ ఫోటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. 'తండ్రీకొడుకులు ఉద్యోగాలు చేయడం సాధారణమే. కానీ ఒకే శాఖలో రెండు విభిన్న హోదాల్లో పనిచేయడం, వారు ఇలా తారస పడటం ఎంతో అద్భుతం' అంటూ కాంమెంట్‌ చేస్తున్నారు. నెట్టింట్లో షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే 50వేల మందికి పైగా లైక్ వచ్చాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)