బెంగళూరులో మాస్క్ తప్పనిసరి !

Telugu Lo Computer
0


కర్ణాటక రాజధాని బెంగళూరులో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజూ 200కు పైగా కొత్త కేసులు నమోదవుతుండడంతో ప్రజలు మాస్కులను  ధరించాలని ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం రోజుకు 16 వేల పరీక్షలు చేస్తుండగా దానిని 20 వేలకు పెంచాలని, అలాగే, ప్రైవేటు ల్యాబుల్లో రోజుకు 4 వేల మందికి పరీక్షలు చేయాలని చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ తమను కోరినట్టు బెంగళూరు మహానగర్ పాలికె డాక్టర్ హరీష్ కుమార్ తెలిపారు. మాల్స్‌ సహా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పించమని కూడా ఆయన తమను ఆదేశించినట్టు చెప్పారు. నేటి నుంచి మార్షల్స్ ద్వారా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)