గెహ్లాట్ సోదరుడిపై సీబీఐ దాడులు

Telugu Lo Computer
0


రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ ఇంట్లో ఇవాళ సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అగ్రసేన్ ఆఫీసుకు కూడా దర్యాప్తు సంస్థ వెళ్లినట్లు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. గతంలో ఫెర్టిలైజర్ల స్కామ్‌లో అగ్రసేన్‌ను ఈడీ అధికారులు విచారించారు. గత ఏడాది పలు ప్రదేశాల్లో ఈడీ దాడులు కూడా చేసింది. 2007 నుంచి 2009 మధ్య సబ్సిడీ ఫెర్టిలైజర్‌ను విదేశాలకు ఎగుమతి చేసినట్లు అగ్రసేన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ జోద్‌పూర్‌లో ఉన్న అగ్రసేన్ ఇంట్లో సీబీఐ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)