సీఏపీఎఫ్‌, అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు

Telugu Lo Computer
0


అగ్నిపథ్‌ స్కీమ్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో నిరసనకారులు రైళ్లను తగలబెట్టడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అ‍గ్నివీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సీఏపీఎఫ్‌, అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్రం తెలిపింది. అగ్నిపథ్' కింద ఆర్మీకి ఎంపికై నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్‌లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వెల్లడించింది. ఈ రెండు దళాల్లో నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు పెంచుతామని కేంద్రం తెలిపింది. అగ్నివీర్ తొలి బ్యాచ్ వారికి .. కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)