ప్రేమ జంట ఆత్మహత్య

Telugu Lo Computer
0


తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్‌నగర్‌కు చెందిన వెంకవ్వ, దశరథం దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు గతంలో అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నకుమారుడు నామ వేణుగోపాల్‌ (24) ఇదే పట్టణానికి చెందిన మచ్చ పూజ (26) ఇద్దరూ స్థానికంగా గోపాల్‌నగర్‌లోని ఓ ప్రైవేటు క్లినిక్‌ రిసెప్షన్‌లో పని చేస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రులు ఆమెకు నాలుగేళ్ల క్రితం మేన బావ అజయ్‌తో పెళ్లి చేశారు. భర్తతో ఆమె సఖ్యతగా ఉండటం లేదు. అవివాహితుడైన వేణుగోపాల్‌తో తరచుగా కలిసి తిరుగుతోంది. వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 15 నుంచి ఆమె ఇంటికి తిరిగి రాకపోవటంతో సిరిసిల్ల పోలీసు స్టేషన్‌లో భార్య అదృశ్యమైందని మే 16న భర్త ఫిర్యాదు చేశారు. విషయం తెలిసి, మనస్తాపానికి గురైన జంట ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయారు. మూడు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలోని ధర్మారం చౌరస్తా సమీపానికి బైక్‌పై వచ్చి ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. జంట ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)