కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం శనివారం చైనా వీసా స్కామ్‌కు సంబంధించి తన వాంగ్మూలాలను నమోదు చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ముందు వరుసగా మూడో రోజు హాజరయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన కార్తీ చిదంబరం, తన రహస్య పార్లమెంటరీ పత్రాలను స్వాధీనం చేసుకున్నందుకు సీబీఐకి వ్యతిరేకంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశానని, ఆయన సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. అతను తన విచారణను ఒక టెస్ట్ క్రికెట్ గేమ్‌తో పోల్చారు. తనపై సీబీఐ వేధింపులు రాజకీయ పగతో కూడిన "వ్యూహం" గా పేర్కొన్నారు. కార్తీని సిబిఐ సుమారు ఆరు గంటల పాటు విచారించింది. శుక్రవారం కూడా దాదాపు ఆరు గంటల పాటు విచారణ కొనసాగింది. అతని చార్టర్డ్ అకౌంటెంట్ ఎస్ భాస్కరరామన్ ప్రస్తుతం సిబిఐ కస్టోడియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో 65,000 ఇమెయిల్‌లను కూడా సీబీఐ రికవరీ చేసింది, వీటిని సాక్ష్యంగా ఉపయోగించనున్నారు.
సీబీఐ నాతో టెస్ట్ క్రికెట్ ఆడుతోంది !
May 28, 2022
0
Tags