నిరుద్యోగితలో ఇండియా నంబర్‌వన్‌ !

Telugu Lo Computer
0

 

ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవటం, సమాజంలో విభజన తీసుకొచ్చేలా రాజకీయాలు చేయటం వంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతున్నాయని ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్‌బసు ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే నిరుద్యోగితలో భారత్‌ ప్రపంచంలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నదని, ఏ దేశంలో లేనంతగా ఇక్కడ 24 శాతానికి పెరిగిందని తెలిపారు. ద్రవ్యోల్బణం పెరగడం ఇప్పుడు అంత ముఖ్యమైన సమస్య కాదని, విద్వేష రాజకీయాలతోనే ప్రమాదమని ఆయన అన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం, సైప్లె చెయిన్‌లో సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిందని తెలిపారు. భారత ఆర్థిక పునాదులు బలంగా ఉన్నా సమాజ విభజన దాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)